NEET Paper Leakage | విద్యార్థుల నిరసనలు ఉధృతం.. నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలనే డిమాండ్‌తో బుధవారం దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో విదార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. జంతర్ మంతర్‌లో సీజేపీ బుధవారం కూడా తన దీక్షను కొనసాగించింది.
- నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
- జంతర్‌మంతర్ వద్ద నిరసనలు హింసాత్మకం.. పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణలు
- పట్నాలో విద్యార్థులపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు
న్యూఢిల్లీ, జూలై 22: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలనే డిమాండ్‌తో బుధవారం దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో విదార్థి సంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. జంతర్ మంతర్‌లో సీజేపీ బుధవారం కూడా తన దీక్షను కొనసాగించింది. అయితే దీక్షాస్థలి వద్ద విద్యార్థులకు, పోలీసులకు మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. సీజేపీ ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వగా, వారిని చెదరగొట్టడానికి పోలీలసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. కొంతమంది కర్రలు ధరించి భద్రతా సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
బీహార్‌లో విద్యార్థులపై లాఠీ చార్జి
లీకేజీ బాధ్యులను శిక్షించాలని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ర్టాల్లో ఆందోళనలు చేపట్టారు. బీహార్‌లోని పట్నాలో లోక్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన విద్యార్థులపై లాఠీ చార్జి, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. మహారాష్ట్రలోని ముంబైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకు వెళ్లి వాహనాలు ఎక్కించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

