చెన్నై : కాలేజ్ డేస్ ఎవరి జీవితంలోనైనా మరిచిపోలేనివి. కాలేజీ రోజుల్లోని ఎన్నో జ్ఞాపకాలు పలువురిని ఎప్పటికీ వెంటాడుతుంటాయి. ఇక చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కాలేజ్ (డబ్ల్యూసీసీ) విద్యార్ధినులు నో బ్యాగ్ డేను సెలబ్రేట్ చేసుకున్న వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను విన్స్ అండ్ ఇఫ్రా పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. నో బ్యాగ్ డేను సెలబ్రేట్ చేసుకునే క్రమంలో విద్యార్ధినులు కుక్కర్, లాండ్రీ బాస్కెట్స్, షూ బాక్స్‌ల వంటి వస్తువులను కాలేజీకి తీసుకువచ్చారు. పీఓవీ : మీ కాలేజ్‌లో నో బ్యాగ్ డే అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి పది లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
విద్యార్ధినుల సృజనాత్మకతను ఇన్‌స్టా యూజర్లు ప్రశంసించారు. పలువురు కాలేజ్ సీనియర్లు సైతం విద్యార్ధినుల ఐడియా బావుందని కామెంట్ చేశారు. తాను డబ్ల్యూసీసీలో ఉండగా ఇలాంటిది జరిగితే బావుండేది..ఏమైనా జూనియర్స్ మీరు రాకింగ్ అంతే అని ఓ యూజర్ రాసుకొచ్చారు. మీరు ఇన్నోవేటివ్ ఐడియాతో రావడం బావుందని మరో యూజర్ పేర్కొన్నారు.
Read More