న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్‌పాల్‌ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు. క్రమశిక్షణతో ఉండాలని, జుట్టు కత్తిరించుకొని స్కూల్‌కు రావాలని సూచించిన ఆ ప్రిన్స్‌పాల్‌పై ఇద్దరు విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనలో ప్రిన్స్‌పాల్ జగ్బీర్ సింగ్ పన్నూ(50) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
హిసార్ జిల్లా నర్నౌద్ పట్టణం ‘బాస్’ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం అక్కడ్నుంచి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.