జెన్ జీ నుంచి జెన్ ఆల్ఫా చేతుల్లోకి.. పట్నం నుంచి పల్లెకు పాకిన విద్యార్థుల ఉద్యమం
విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జెన్‌జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్‌జీ నుంచి జెన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంతకూ బలపడుతున్నాయి.
న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జెన్‌జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్‌జీ నుంచి జెన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంతకూ బలపడుతున్నాయి. నీట్ పరీక్షల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై జూన్-జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలో జరిగిన ఆందోళనల అనంతరం ఇప్పుడు వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ సమస్యలను ఎత్తిచూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు, మరుగుదొడ్లు లేవు, ఉపాధ్యాయులు లేరు, మౌలిక సదుపాయాలు లేవు, చివరకు సరైన పాఠశాల భవనం కూడా లేదనే సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. దేశ సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో జెన్ ఆల్ఫా విద్యార్థులు(2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారు) తమ విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఇలాంటి వార్తలు వెలువడ్డాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తమ గొంతును వినిపిస్తూ, తక్షణ పరిష్కారం కోసం నినదిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో స్కూల్స్ సేఫ్ ఉద్యమం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈనెల 21న 36 జిల్లాలకు చెందిన జెన్ ఆల్ఫా, జెన్ జీ విద్యార్థులు, ఉపాధ్యాయులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ స్కూల్స్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు.
యూపీలోనూ నిరసనలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఫతేపూర్, హమీర్పూర్, కన్నౌజ్ తదితర నగరాల్లో ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను విద్యార్థులు దిగ్బంధించారు. నిపుణులైన ఉపాధ్యాయుల కొరతకు నిరసనగా ఈనెల 14న లక్నోలోని జైప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈనెల 19న ఉన్నావ్‌లోని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన వందలాది విద్యార్థులు నాసిరకం ఆహారం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. కిషన్పూర్లోని సర్వదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాల కోసం జూలై 28న ఆందోళన నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

