భోపాల్: స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఒక విద్యార్థి కాల్చి చంపాడు. (Student Shoots Principal Dead) ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆయన బైక్‌పై పారిపోయాడు. కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్లు భయాందోళన చెందారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధమోరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన 55 ఏళ్ల సురేంద్ర కుమార్ సక్సేనా సుమారు ఐదేళ్లుగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం స్కూల్లోని టాయిలెట్‌కు వెళ్తున్న ఆయనను 12వ తరగతి విద్యార్థి ఫాలో అయ్యాడు. ప్రిన్సిపాల్ తలపై గన్‌తో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత మరో విద్యార్థితో కలిసి సురేంద్ర కుమార్ సక్సేనా బైక్‌పై అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, కాల్పుల శబ్దానికి స్కూల్లోని టీచర్లు, స్టూడెంట్స్ భయాందోళన చెందారు. రక్తం మడుగుల్లో పడి ప్రిన్సిపాల్ మరణించడాన్ని చూశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకున్నారు. సురేంద్ర కుమార్ సక్సేనా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రిన్సిపాల్‌పై కాల్పుల తర్వాత మరో విద్యార్థితో కలిసి ఆ స్టూడెంట్ పారిపోవడాన్ని గమనించారు. క్రమశిక్షణా రాహిత్య చరిత్ర ఉన్న ఆ ఇద్దరు విద్యార్థులు ధిలాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.