Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన అంకుష్ మీనా అనే విద్యార్థి నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, అతని మరణానికి చదువు ఒత్తిడితో సంబంధం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. మరోవైపు విద్యార్థి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read..
Virat Kohli | ఎయిర్పోర్ట్లో మహిళకు హగ్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్
Hydrogen Train | భారత్ తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది..! ట్రైన్ ప్రత్యేకతలు ఇవే..!
Digital Arrest: 5 రోజుల పాటు డిజిటల్ అరెస్టు.. కోటి కాజేసిన సైబర్ నేరగాళ్లు