జైపూర్, డిసెంబర్ 21: పోటీ, ప్రవేశ పరీక్షల కేంద్రంగా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్‌కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్లో తానుంటున్న హాస్టల్లో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జేఈఈలో శిక్షణ పొందేందుకు ఏప్రిల్‌లో కోటాకు వచ్చిన ఈ విద్యార్థి తన ఆత్మహత్యకు కారణమేమిటో ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని కోటా డీఎస్పీ లోకేంద్ర పల్లీవాల్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని అధికారులు వివరించారు.