న్యూఢిల్లీ : మంచు దుప్పటి కప్పుకున్న కొండలు, చెట్ల మధ్య సేద తీరాలని మనాలీకి వెళ్లిన పర్యాటకులకు కష్టాలు ఎదురయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రముఖ పర్యాటక కేంద్రానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్లో దాదాపు 24 గంటలపాటు కార్లలోనే చాలా మంది గడిపారు.
వరుస సెలవులు రావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు మనాలీకి వచ్చారు. హైవేలపై ట్రాఫిక్ జామ్లతోపాటు హోటళ్లు ఖాళీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.