న్యూఢిల్లీ, జనవరి 16: డీప్‌ఫేక్ అంశంపై జారీచేసిన అడ్వైజరీపై వివిధ సోషల్ మీడియా, డిజిటల్ సంస్థల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తప్పుడు సమాచార వ్యాప్తి, డీప్‌ఫేక్ వంటి వీడియోల కట్టడికి కఠిన చర్యలు తీసుకొంటున్నామని, ఇందుకు సంబంధించి మరో 7-8 రోజుల్లో సవరించిన ఐటీ నిబంధనలను జారీ చేస్తామని మంగళవారం వెల్లడించారు.