వారణాసి: సాధారణంగా ఒక దేశానికి చెందిన పౌరులు మరో దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, విచిత్రంగా ఇప్పుడు జయ అనే ఓ వీధి కుక్కకు పాస్ట్‌పోర్ట్ లభించింది. త్వరలోనే ఆ స్ట్రీట్ డాగ్ జయ నెదర్లాండ్స్‌కు పయనం కానుంది. వీధి కుక్క ఏమిటి..? దానికి పాస్ట్‌పోర్టు ఎందుకు..? అది నెదర్లాండ్స్‌కు వెళ్లడం దేనికి..? అనే సందేహాలు మీ మెదళ్లను తొలుస్తున్నాయి కదా..? అయితే ఇక వివరాల్లోకి వెళ్దాం.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి చెందిన ఓ వ్యక్తి ఒక వీధి కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి జయ అనే పేరు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లూ ఆ వీధి కుక్కను కుటుంబసభ్యురాలిలా చూసుకున్న యజమాని కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఓ మహిళకు ఇచ్చేశాడు. సదరు మహిళ జయను నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లడం కోసం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసింది. దాంతో అధికారులు తాజాగా పాస్‌పోర్టు జారీ చేశారు.
పాస్‌పోర్టు రావడంతో నెదర్లాండ్స్‌కు చెందిన ఆ మహిళ వీధి కుక్క జయను తీసుకుని త్వరలోనే నెదర్లాండ్స్‌కు పయనం కానుంది. తన కొత్త యజమానితో కలిసి నెదర్లాండ్స్‌కు వెళ్లేందుకు జయ రెడీ అయిపోయింది. త్వరలోనే ఫ్లైట్ జర్నీ చేసి నెదర్లాండ్స్ నేలపై కాలు మోపనుంది.