పుణె, జనవరి 1: పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒకే పార్టీ.. ఇద్దరికీ ఏ, బీ ఫారం ఇచ్చింది. దీంతో ఇంకో వ్యక్తికిచ్చిన ఫారాన్ని అపహరిస్తే తానే పార్టీ అభ్యర్థినవుతానని భావించిన ధన్కావడి-సహకార్ నగర్ వార్డులో శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక వ్యక్తి తన ప్రత్యర్థి ఏ,బీ ఫారంను అమాంతం లాక్కుని నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు.
దీంతో ప్రత్యర్థి అభ్యర్థి లబోదిబోమనడంతో సహాయ ఎన్నికల అధికారి మనీషా భుట్కర్ భారతీ విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం వార్డు కార్యాలయానికి వచ్చిన నిందితుడు అభ్యర్థుల లిస్టు, ఫారాలు ఉన్న ఫైల్‌ను అధికారుల నుంచి తీసుకొని, బాత్రూమ్లోకి పరుగెత్తి దానిని నమిలేసి మింగేశాడు.