Bangalore | బెంగళూరు: భారీ వర్షాలు, ట్రాఫిక్ జామ్‌లు బెంగళూరు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం, నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్‌ను ఒకవైపు మూసేశారు. దీంతో రెండు గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో నిరీక్షించలేక కొందరు వాహనాలను అక్కడే విడిచిపెట్టి ఇండ్లకు నడుచుకుంటూ వెళ్లిపోయారు.
ఇందుకు సంబంధించిన చిత్రాలను చాలామంది ట్రాఫిక్.ఇన్‌లో పంచుకున్నారు. ‘పూర్తిగా గందరగోళంగా ఉంది! ఈ పరిస్థితుల్లో ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైతే బతకడానికి అవకాశమే ఉండదు. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ దాదాపుగా జామ్ అయింది’ అని ఎక్స్‌లో ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.