ముంబై: ఈనెల ఆరంభంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ సమయంలో స్టాక్‌మార్కెట్ అక్రమాలపై ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందం మంగళవారం ‘సెబీ’ అధికారులతో సమావేశమైంది. స్టాక్మార్కెట్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఎంపీల బృందం సెబీని డిమాండ్ చేసింది.