న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వం(రాజ్యం) ఎప్పుడూ బలహీన వర్గాల పక్షానే ఉండాలని, వారు సంఖ్యాపరంగా గానీ, సామాజిక పరంగా గానీ మైనారిటీ కావచ్చునని, కానీ తద్వా రా పౌరులు ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ కేశవ చంద్ర మెమోరియల్ వ్యాసరచన పోటీకి అతిథిగా విచ్చేసిన ఆయన ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గీయులకు వారి మార్గముంటుందని, కానీ మైనారిటీ తన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని అన్నారు.
బానిసత్వ నిర్మూలన, కుల నిర్మూలన, లింగ మైనారిటీల విముక్తి, మత సామరస్యం ఇలా అన్నీ ఒకప్పుడు భిన్న అభిప్రాయాలని, అయితే ఈ భిన్న అభిప్రాయాలు ఒక ముఖ్యమైన సంభాషణను ప్రారంభించడం ద్వారా మన సమాజాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించగలిగే శక్తికి కలిగి ఉన్నాయని సీజేఐ అన్నారు.