న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పిపంపారు. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు గతేడాది సెప్టెంబర్‌లో బిల్లును రూపొందించింది. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్‌కు పంపింది. గవర్నర్ ఈ బిల్లును అయితే రాష్ట్రపతికి పంపాలి.. లేకపోతే పునఃసమీక్ష కోసం తిరిగి అసెంబ్లీకి పంపాలి. కానీ గవర్నర్ అదేమీ చేయలేదు. బిల్లును తన వద్దే పెట్టుకొన్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విమర్శలు రావడంతో శుక్రవారం గవర్నర్ ఈ బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపారు. దీనిపై పార్లమెంట్లో చర్చకు డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు.