చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులకు సూచించారు. సహాయ కార్యక్రమాల్లో వాయుసేన, సైనిక సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.
ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. ఈ విమానంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది.