న్యూఢిల్లీ: భారతీయ జాలర్ల(Fisherman)పై శ్రీలంక నేవీ కాల్పలు జరిపింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. ఈ ఘటన పట్ల భారత సర్కారు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. 13 మందితో వెళ్తున్న నౌకపై జరిగిన దాడిలో ఇద్దరు జాలర్లు తీవ్రంగా గాయపడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గాయపడ్డ ఆ జాలర్లకు ప్రస్తుతం జాఫ్నా ఆస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. లంక దౌత్యవేత్తను పిలిపించిన విదేశాంగ శాఖ.. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ బలప్రయోగం ఆమోదయోగ్యం కాదు అని విదేశాంగ శాఖ తెలిపింది. శ్రీలంక, భారత్ మధ్య ఉన్న జాలర్ల సమస్యను పరిశీలించాలని విదేశాంగ శాఖ తెలిపింది.