Sri Lanka Crisis | శ్రీలంక సంక్షోభంపై 19న అఖిలపక్షం భేటీ
Sri Lanka Crisis | పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి శ్రీలంకలో పరిస్థితి, గతంలో ఆ దేశానికి భారత్ అందించిన సహాయంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
పలు రాజకీయ పార్టీల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక సంక్షోభం, శరణార్థుల ప్రవేశంపై తమిళనాడులో ఆందోళన నెలకొన్నది. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్తో ఇటీవల జరిగిన సమావేశంలో శ్రీలంకలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆర్థికంగా దెబ్బతిన్న ఆ దేశానికి అవసరమైన సామగ్రి పంపేందుకు అనుమతి కోరారు. గత కొద్ది నెలలుగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.
ఆందోళనకారులు అధ్యక్షుడి భవనాన్ని ముట్టించగా.. ఆయన దేశం విడిచిపారిపోయారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా పని చేసిన రణిల్ విక్రమసింఘే సైతం పదవికి రాజీనామా చేశారు. అనంతనం తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ బాధ్యతలు స్వీకరించారు. 225 మంది సభ్యులున్న పార్లమెంట్ ఈ నెల 20న ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నది. శ్రీలంక ప్రస్తుతం ఇంధనం, ఇతర నిత్యావసర సామగ్రి కొరతను ఎదుర్కొంటున్నది. ఇంధనం సరఫరా లేక పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

