కొలంబో: శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్(Mithra Vibhushana)ను ప్రధాని మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార డిసనాయక.. ఆ అవార్డుతో ఇవాళ మోదీని సన్మానించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించినట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. శ్రీలంకలో అత్యున్నత పౌర పురస్కారం అయిన మిత్ర విభూషణ్ అవార్డును 2008లో ప్రారంభించారు. ఆ నాటి అధ్యక్షుడు మహింద రాజపక్స ఈ అవార్డును నెలకొల్పారు. గతంలో మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్, పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ అందుకున్నారు.
లంక అధ్యక్షుడు దిసనాయకే తనకు మిత్ర విభూషణ్ అవార్డును అందజేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు కూడా గర్వకారణమన్నారు. కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియేట్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ప్రశంసా పత్రంతో పాటు రజత పతకాన్ని అందజేస్తారు. ఆ సిల్వర్ మెడల్లో 9 రకాల లంక ముత్యాలు ఉంటాయి. కమలం, విశ్వం, సూర్యుడు, చంద్రుడు, వరి కంకి గుర్తులు ఉన్నాయి. మెడల్‌పై ధర్మచక్రం.. బౌద్ద సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. వరి కంకులతో ఉన్న పూర్ణ కలశం సమృద్ధికి చిహ్నం.
#WATCH | Prime Minister @narendramodi was conferred the prestigious Mithra Vibhushana medal by the Government of Sri Lanka, recognizing his exceptional efforts to strengthen bilateral ties and promote shared cultural and spiritual heritage. This marks the 22nd international award… pic.twitter.com/UqKzwqFCk1
— PB-SHABD (@PBSHABD) April 5, 2025