న్యూఢిల్లీ: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి స్థల వివాదంపై పూర్తి నివేదికను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది.
ఈ అంశంపై మథుర జిల్లా కోర్టులో విచారణలో ఉన్న అన్నీ పిటిషన్లను తమకు బదిలీ చేయాలని అలహాబాద్ హైకోర్టు మే 26న ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ షాహిద్ మసీదు ఈద్గా మేనేజ్మెంట్ ట్రస్ట్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.