న్యూఢిల్లీ : పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు బెయిలు మంజూరు చేసేందుకు హర్యానాలోని హిసార్ కోర్టు బుధవారం తిరస్కరించింది.
కోర్టు ఈ నెల 9న ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించి, తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఆమె బెయిలు దరఖాస్తుపై విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టుకు హాజరైంది.