Spurious liquor | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కళ్లకురిచి (Kallakurichi) జిల్లాలో కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారు కళ్లకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Also Read..
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
SpiceJet | విమానంలో పనిచేయని ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు.. VIDEO
Naveen Patnaik | ఓహ్.. మీరేనా నన్ను ఓడించింది.. బీజేపీ ఎమ్మెల్యేని అభినందించిన నవీన్ పట్నాయక్