‘తల్లిపై డబ్బు, సమయం వెచ్చించడం గృహహింస కాదు’
భర్త తన తల్లితో కొంత సేపు గడపటం, ఆమెకు కొంత డబ్బు ఇవ్వడం తన భార్యను వేధించడం కిందకు రాదని ముంబై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఆ భర్తపైన, ఆయన బంధువులపైనా గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం,
ముంబై: భర్త తన తల్లితో కొంత సేపు గడపటం, ఆమెకు కొంత డబ్బు ఇవ్వడం తన భార్యను వేధించడం కిందకు రాదని ముంబై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఆ భర్తపైన, ఆయన బంధువులపైనా గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం, తమ కుమార్తెకు పోషణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. పిటిషనర్ మహారాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఆమె 2015లో దాఖలు చేసిన పిటిషన్ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తన భర్త తరచూ ఆయన తల్లికి ఆర్థిక సాయం చేయడం, ఆమెతో కొంత సమయాన్ని గడుపుతుండటం వల్ల తమ మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు కోర్టుకు తెలిపారు. తమ వివాహానికి ముందు తన అత్తగారి మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలియదని చెప్పారు. దీనివల్ల కుటుంబంలో ఉద్వేగాలు మరింత పెరిగాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

