డెహ్రాడూన్, జూలై 18 : మీరు మీ భార్యకు చీర కొనాలనుకుంటున్నారా? వంటగదిలో వాడుకోవడానికి ఒక మిక్సరో, గ్రైండరో అమర్చాలనుకుంటున్నారా? లేదా స్మార్ట్‌ఫోన్ కొనుక్కుందామని ముచ్చట పడుతున్నారా? మీరే కనుక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవన్నీ చేయడానికి ముందుగా మీ బాస్‌కు ఈ విషయాన్ని తెలియజేయాలి. అంతేకాదు దానికి ఆయన అనుమతి కూడా తీసుకోవాలి.
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వును చూసి అక్కడి ఉద్యోగులు జుట్టు పీక్కుంటున్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.