Parliament session | కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ 3.0 కేబినెట్ కూర్పు కూడా పూర్తైంది. మొత్తం 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం (MPs to take oath) ఉంటుందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి.
ఎనిమిది రోజులపాటు ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్ 24 నుంచి జులై 3 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు వెల్లడించాయి. ఇందులో భాగంగా జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్ 24, 25 తేదీల్లో కొత్త పార్లమెంట్ సభ్యులు ప్రమాణం స్వీకారం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి.
Also Read..
Toll Booth | ట్యాక్స్ చెల్లించమన్నందుకు టోల్ బూత్‌ను బుల్డోజర్తో ధ్వంసం చేసిన డ్రైవర్.. VIDEO
Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Modi 3.0 Ministers | కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్‌షా.. ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు