Badrinath | బద్రినాథ్ ధామ్‌కు పోటెత్తుతున్న భక్తులు.. నెలలోపే 5 లక్షల మంది విజిట్
Badrinath | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా బద్రినాథ్ ధామ్ (Badrinath Dham)కు భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు.
Badrinath | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)లో భాగంగా బద్రినాథ్ ధామ్ (Badrinath Dham)కు భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో భక్తులు బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తాజాగా తెలిపారు. ఆలయం తెరిచిన నెలరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రినాథ్ ధామ్‌ను సందర్శించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే 50 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నట్లు తెలిపారు.
ఈ మేరకు బద్రినాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కిషోర్ పన్వార్ మాట్లాడుతూ.. ‘చార్ధామ్ యాత్రకు ఇప్పటి వరకూ 19 లక్షల మంది భక్తులు వచ్చారు. ఆలయం తెరిచిన నెలలోపే బద్రినాథ్ ధామ్‌ను 5 లక్షల మంది విజిట్ చేసి.. బద్రి విశాల్ స్వామి (Lord Badri Vishal)ని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నాం’ అని తెలిపారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్ ఆలయ తలుపులు గత నెల 12వ తేదీన తెరుచుకున్న విషయం తెలిసిందే. శీతాకాల సీజన్లో మూసివేసిన ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. చార్ధామ్ యాత్రలో భాగమైన కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లో అక్షయ తృతీయ సందర్భంగా పూజలు చేసి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు చార్ధామ్ యాత్రకు పోటెత్తుతున్నారు.
Also Read..
Vijay Thalapathy | దళపతి విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ టాపర్స్‌కు సన్మానం
Rajinikanth | వన్ అండ్ ఓన్లీ గిఫ్ట్.. రజినీకాంత్, అనుపమ్ ఖేర్ వీడియో వైరల్
Hyderabad | మణికొండలో కారు బీభత్సం.. పార్కింగ్ చేసిన బైక్‌లపై దూసుకెళ్లిన మైనర్ బాలుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

