TRAI | న్యూఢిల్లీ: గతంలో మొబైల్ ఫోన్లలో వాయిస్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్యాకేజీలుండేవి. వీటిని మళ్లీ తీసుకొచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు చేస్తున్నది. ఇందు కు సంబంధించిన కీలక పత్రాన్ని ట్రాయ్ సిద్ధం చేసింది. దీనిలో పేర్కొన్న విషయంపై పరిశ్రమ వర్గాలు, మొబైల్ ఫోన్ వినియోగదార్ల నుంచి అభిప్రాయాల్ని సేకరించబోతున్నది.
ఆగస్టు 16 నుంచి రాతపూర్వకంగా అభిప్రాయ సేకరణ ఉంటుందని ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికాం కంపెనీలు ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల్లో..వాయిస్ కాల్స్, డాటాను మాత్రమే వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ప్యాకేజీలో..ఎస్ఎంఎస్, వాయిస్ మెస్సేజ్..అన్న వాటిని ఉపయోగించుకోకున్నా.. వాటిని వినియోగదారులకు టెలికాం కంపెనీలు బలవంతంగా అంటగడుతున్నాయన్న ఆరోపణ ఉంది.