న్యూఢిల్లీ: రైళ్లలో ఐఆర్సీటీసీ అందించే ఆహార మెనూలో మార్పులు చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటివరకు పరిమిత సంఖ్యలో ఆహార పదార్థాలు అందిస్తుండగా, ఇకనుంచి డయాబెటిక్, ఇతర వ్యాధిగ్రస్తులు, శిశువుల కోసం ప్రత్యేక ఆహారం అందించాలని నిర్ణయించింది. దీంతోపాటు స్థానిక, ప్రాంతీయ వంటకాలను మెనూలో చేర్చాలని ఐఆర్సీటీసీకి రాసిన లేఖలో రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది.