న్యూఢిల్లీ : దేశం తీవ్రమైన వైద్యుల కొరతను ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. మెడికల్ సీట్లు చాలా విలువైనవని, వాటిని వృథాకానివ్వరాదని తెలిపింది. ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయడం కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. వైద్య కోర్సుల ప్రవేశ ప్రక్రియను ఈ నెల 30నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కళాశాలలు కేవలం ప్రభుత్వ అడ్మిషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రవేశాలను కల్పించాలని స్పష్టం చేసింది. వెయిట్లిస్టెడ్ క్యాండిడేట్ల నుంచి మాత్రమే ఎంపిక చేయాలని వివరించింది.