న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఓ ఎంపీ ఇటీవల ఈ-సిగరేట్ తాగారు. ఆ అంశం దుమారం రేపింది. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ఈ-సిగరేట్ అంశాన్ని ప్రస్తావించారు. హౌజ్లో ఈ-సిగరేట్ తాగిన వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. పార్లమెంట్ మర్యాదను కాపాడే అంశంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బహిరంగంగా ఈ-సిగరేట్ తాగినట్లు బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ ఇటీవల స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే సభామర్యాదను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు ఈ-సిగరేట్ తాగిన అంశం దర్యాప్తులో ఉన్నదని, సంబంధిత కమిటీకి ఈ విషయాన్ని చేరవేస్తామన్నారు. ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని, సభ్యత్వం కోల్పోయే అవకాశం కూడా ఉందని లోక్సభ స్పీకర్ వెల్లడించారు. సభా హుందాతనాన్ని కాపాడడం బాధ్యత అని, మర్యాదును పాటించనివారికి నియామవళి ప్రకారం శిక్ష ఉంటుందన్నారు.
#WATCH | Delhi: On E-cigarette within the House controversy, Lok Sabha Speaker Om Birla says, “The process of investigation is in the direction of being completed. As soon as the investigation process is completed, the action plan will be made and will go to the committee, and… pic.twitter.com/G1LYWs05Hz
— ANI (@ANI) January 12, 2026