Sneha | భువనేశ్వర్: 20 ఏండ్ల క్రితం తనను, తన తమ్ముడిని అనాథాశ్రమంలో వదిలి వెళ్లిన కన్న తల్లి కోసం స్నేహ(21) అనే స్పెయిన్ యువతి భువనేశ్వర్‌లో తీవ్రంగా గాలిస్తున్నది. తన విద్యాభ్యాసం నిమిత్తం సోమవారం స్పెయిన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆమె ఎంతో ఆశతో తల్లి జాడ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆమెను దత్తత తీసుకున్న స్పెయిన్ జంట ఇందుకు సహకరిస్తున్నారు.
స్నేహ వెల్లడించిన వివరాల ప్రకారం.. వంటవాడిగా పనిచేసే స్నేహ తండ్రి 2005లో భువనేశ్వర్‌లోని నయపల్లి ప్రాంతంలో భార్య, పిల్లలను వదిలిపెట్టి పోయాడు. నలుగురు పిల్లల్ని పోషించలేని స్నేహ తల్లి బానలత స్నేహను, ఆమె తమ్ముడు సోమును భువనేశ్వర్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో వదిలి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది. 2010లో స్నేహ, సోమును స్పెయిన్ జంట గెమ విదాల్, జుయాన్ జోష్ చట్టబద్ధంగా దత్తత తీసుకొని వారి దేశానికి తీసుకెళ్లి బాగా చదివించారు.