GSAT-N2 | చెన్నై, నవంబర్ 18: ఇస్రోకు చెందిన జీశాట్-20(జీశాట్-ఎన్2) ఉపగ్రహం ఈ నెల 18న యూఎస్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 12.01 నిమిషాలకు) స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ ఇందుకు వేదిక కానుందని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వియాన్ వార్తా సంస్థకు వెల్లడించారు. బ్యాకప్ ప్రయోగ తేదీగా యూఎస్ కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 9.33 గంటలను ఎంపిక చేశారు. 4.7 టన్నుల బరువైన ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌తో పాటు భారత్ మొత్తాన్ని కవర్ చేసి బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది.