జైపూర్: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యేది సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) అన్నారు. బీజేపీ పరిపాలనతో ప్రజలు విగిసిపోయారని అఖిలేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని.. బీజేపీ పరిపాలనా వైఫల్యంవల్లే అలా జరిగిందని అఖిలేష్ యాదవ్ చెప్పారు.
బీజేపీ తీరుతో విసిగిపోయిన ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీనే గెలిపించబోతున్నారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా మీడియా పలుకరించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మినహా అన్ని చిన్నపార్టీలతో కలిసి కూటమిగా బరిలో దిగబోతున్నామని చెప్పారు. కాగా అఖిలేష్ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్చార్జి అరుణ్‌సింగ్ కొట్టిపారేశారు. సమాజ్‌వాది పార్టీకి అధికారంలోకి రావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.