South Indian Dish : దక్షిణాదిలో కొన్ని వంటకాలు అద్భుతమైన రుచితో యావత్ దేశాన్నీ ఆకట్టుకుంటాయి. సదరన్ స్పైసీ ఫుడ్‌ను ఉత్తరాది వారూ ఇష్టంగా ఆరగిస్తారు. ఇక సౌతిండియా ఫేవరెట్ డిష్ దోశ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని ప్రాంతాల వారూ దోశను అమితంగా ఇష్టపడతారు.
ట్రావెల్, ఫుడ్ గైడ్ ప్లాట్‌ఫాం టేస్ట్ అట్లాస్ ప్రపంచంలో ఉత్తమ పాన్కేక్స్లో దోశకు పదో ర్యాంకును కట్టబెట్టింది. దేశవిదేశాల్లో దోశను అందరూ ఎంత ఇష్టంగా ఆరగిస్తారనే విషయాన్ని టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ వెల్లడిస్తోంది. భారతీయ దోశను దేశమంతటా ఆస్వాదిస్తారని, అయితే కొందరు ఈ డిష్ దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో పుట్టిందని నమ్ముతారని కానీ దోశ ఒకటో శతాబ్దంలో తమిళ సాహిత్యంలో దీని ప్రస్తావన ఉందని టేస్ట్ అట్లాస్ తమ వెబ్సైట్లో పేర్కొంది.
ఇక దోశ ప్రియులకు మరింత గుడ్ న్యూస్ అందించేలా మసాలా దోశకు 12వ ర్యాంక్ దక్కింది. మైసూర్ మసాలా దోశ నుంచి ఆనియన్ మసాలా దోశ వరకూ ఈ దోశ నూరూరించే వేరియేషన్స్‌లో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరినో తన రుచులు పంచుతూ ఊరిస్తుంటుంది.
Read More :