నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల

కోల్కత్తా : బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వుడ్ల్యాండ్స్ దవాఖాన వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దాదాకు బైపాస్ శస్త్ర చికిత్స అవసరం లేదని తెలిపారు. వైద్యానికి ఆయన బాగా స్పందిస్తున్నారని, ఈసీజీ రిపోర్టు సంతృప్తికరంగా ఉందని చెప్పారు.
భవిష్యత్లో ఆయన అందించాల్సిన వైద్య చికిత్సపై రేపు వైద్య నిపుణుల బృందం భేటీయై చర్చించనున్నారు. వైద్య నిపుణుల బృందం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నది. గంగూలీకి నిన్న గుండెపోటు రావడంతో కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ దవాఖానలో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో వైద్యులు యాంజియోప్లాస్టి సర్జరీ చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.