Sonia Gandhi | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వెల్లడించండి : ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు. 9 కీలక అంశాలపై చర్చకు సమయం కేటాయించాలని కూడా ఆమె ప్రధానిని కోరారు. ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఈ లేఖలో సోనియా గాంధీ ప్రస్తావించారు. అసలు ఈ సమావేశాల అజెండా ఏంటో తమకెవరికీ తెలియదని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాను ప్రభుత్వం వెల్లడించాలని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని విపక్ష ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మహిళా రిజర్వేషన్ల బిల్లును సత్వరమే ఆమోదించాలని కూడా విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశాన్ని కూడా ప్రస్తావించాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. భోపాల్‌లో తదుపరి భేటీ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి పార్టీల తొలి ర్యాలీని నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నాయి.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన డిన్నర్ భేటీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష పార్టీలు చర్చించాయి. అజెండా వెల్లడించకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం సరైంది కాదని భేటీ అనంతరం ఖర్గే పేర్కొన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్, చైనా దురాక్రమణ, కాగ్ నివేదికలు, స్కామ్‌లు, వ్యవస్ధల నిర్వీర్యం వంటి కీలక అంశాలపై చర్చను పక్కదారి పట్టించేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Read More :
Kaun Banega Crorepati-15 | రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోయిన జస్కరన్ సింగ్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

