Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
టాలీవుడ్లో తన నటనతో అలరించిన ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
టాలీవుడ్లో తన నటనతో అలరించిన ప్రముఖ నటి మోనాల్ గజ్జర్ సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె, ఇటీవలి కాలంలో ‘పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా’ అనే థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించారు. ఈ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఆమె ఎంతో ధైర్యంగా చికిత్స తీసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో తనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, ఆరోగ్యం మెరుగ్గా ఉందని స్పష్టం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ.. జీవితంలో ఏది ముఖ్యం కాకపోయినా, మంచి ఆరోగ్యం మరియు ప్రశాంతమైన మనస్సు ఉండటమే అసలైన సంపదని అభిప్రాయపడ్డారు. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని ఎంత తేలికగా నిర్లక్ష్యం చేస్తారో ఈ అనారోగ్య అనుభవం తనకు కళ్లకు కట్టినట్లు తెలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మహిళలందరూ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ముందస్తు జాగ్రత్తగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం మోనాల్ గజ్జర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షలు తెలుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

