KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
KTR | రామగుండం నియోజకవర్గం వేమునూర్ గ్రామ సర్పంచ్ కోల లత కోడలు, కోల మహేష్ – లక్ష్మీ దంపతుల కుమార్తె ,సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన అన్ డిఫైనేబుల్ గర్ల్ (Un పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.
గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం వేమునూర్ గ్రామ సర్పంచ్ కోల లత కోడలు, కోల మహేష్ – లక్ష్మీ దంపతుల కుమార్తె ,సివిల్స్ విద్యార్థిని కోల సింధు ( Kola Sindhu ) రచించిన అన్ డిఫైనేబుల్ గర్ల్ (Un Definable Girl) పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి కోల సింధును గురువారం హైదరాబాదులో కేటీఆర్ వద్దకు తీసుకువెళ్లి ఆమె రచించిన పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా కోల సింధు రచించిన పుస్తకాన్ని అభినందిస్తూ, ఆమె రచనా ప్రతిభను కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రతిష్టాత్మకమైన ఆలిండియా సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే రచనా రంగంలో ప్రతిభను చాటుతూ, సివిల్స్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న కోల సింధు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

