Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
Allari Naresh | వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కామెడీ కింగ్, హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న తాజా సంచలన చిత్రం ‘ఆల్కహాల్’ (Alcohol).
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కామెడీ కింగ్, హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న తాజా సంచలన చిత్రం ‘ఆల్కహాల్’ (Alcohol). ‘ఫ్యామిలీ డ్రామా’ వంటి విభిన్న చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ తేజ్ (Meher Tej) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఈ సినిమాను డిసెంబర్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో అల్లరి నరేశ్ సరసన రుహానీ శర్మ (Ruhani Sharma) హీరోయిన్గా నటిస్తుండగా, సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్ఎం (Niharika NM) మరియు కమెడియన్ సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్లో అల్లరి నరేశ్ మరియు కమెడియన్ సత్య మధ్య వచ్చే సంభాషణలు, డైరెక్టర్ మెహర్ తేజ్ మార్క్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రాన్ని డిసెంబర్ 18న థియేటర్లలో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

