Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాగునీటిలో నైట్రేట్ పరిమాణానికి సంబంధించి దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రమాణాలను మార్చాలని ప్రపంచవ్యాప్తంగా పలు ఆరోగ్య, పర్యావరణ సంస్థలు కోరుతున్నాయి. ప్రస్తుత ప్రమాణాలు ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన ఆరోగ్యపరమైన ప్రమాదాలను ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి.
Nitrates | ప్రపంచ ఆరోగ్య సంస్థ తాగునీటిలో నైట్రేట్ పరిమాణానికి సంబంధించి దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రమాణాలను మార్చాలని ప్రపంచవ్యాప్తంగా పలు ఆరోగ్య, పర్యావరణ సంస్థలు కోరుతున్నాయి. ప్రస్తుత ప్రమాణాలు ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన ఆరోగ్యపరమైన ప్రమాదాలను ప్రతిబింబించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్, ప్రపంచ కుటుంబ వైద్యుల సంస్థ సహా మొత్తం 85 సంస్థలు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగానికి బహిరంగ లేఖ రాశాయి. రాబోయే తాగునీటి మార్గదర్శకాల సమీక్షలో నైట్రేట్ అంశాన్ని కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశాయి.
కారణాలు ఏమిటి..?
వ్యవసాయంలో అధికంగా రసాయన ఎరువులు, ఇతర పద్ధతులను ఉపయోగించడం వల్ల నైట్రేట్ అవశేషాలు నీటిలో చేరుతున్నాయి. ఇవి ముఖ్యంగా పిల్లలు, గర్భిణులకు ప్రమాదకరమని ఇప్పటికే గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ఒక లీటరు తాగునీటిలో నైట్రేట్ పరిమాణం గరిష్ఠంగా 50 మిల్లీగ్రాములు లేదా నైట్రేట్-నైట్రోజన్ రూపంలో 11.3 మిల్లీగ్రాముల వరకు ఉండవచ్చు. ఈ పరిమితిని 1958లో నిర్ణయించారు. అప్పట్లో రక్తం ద్వారా శరీరానికి ఆక్సిజన్ చేరవేసే సామర్థ్యం తగ్గిపోయే ప్రాణాంతకమైన బ్లూ బేబీ సిండ్రోమ్ ను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రమాణాన్ని రూపొందించారు. అయితే తక్కువ మోతాదులో నైట్రేట్‌కు ఎక్కువకాలం గురికావడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, గర్భధారణ సమయంలో ప్రతికూల పరిణామాలు, నెలలు నిండకముందే ప్రసవం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిమితి కంటే తక్కువ స్థాయిలో నైట్రేట్ ఉన్న నీటిని తాగినప్పటికీ ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించే వార్షిక వన్ హెల్త్ డే సందర్భంగా ఈ లేఖను పంపించారు. మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందనే అంశంపై ఈ కార్యక్రమం అవగాహన కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అధిక నైట్రేట్ స్థాయిలు ఉన్న నీటిని ఉపయోగిస్తున్నారని సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. భూగర్భజలాలు, నదులను కాపాడకుండా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం సాధ్యం కాదని గ్రీన్‌పీస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అధిక మోతాదులో పశుపోషణ చేసే వ్యవసాయ పద్ధతులను నియంత్రించడంతోపాటు పర్యావరణహిత వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వాలను కోరారు.
నైట్రేట్ల పరిమితిని తగ్గించాలి..
గతేడాది డెన్మార్క్ ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కూడా ప్రస్తుత అంతర్జాతీయ ప్రమాణాలు ప్రజారోగ్యాన్ని పూర్తిగా రక్షించలేకపోతున్నాయని వెల్లడించింది. తాగునీటిలో నైట్రేట్ పరిమితిని లీటరుకు 6 మిల్లీగ్రాములకు తగ్గించాలని ఆ బృందం సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఏడాది డెన్మార్క్ కూడా ఈ మార్పుకు కట్టుబడింది. అయితే చాలా దేశాలు తమ తాగునీటి ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగానే రూపొందిస్తున్నాయి. అందువల్ల ఆ మార్గదర్శకాలను నవీకరించడం ప్రపంచవ్యాప్తంగా తాగునీటి భద్రతకు సంబంధించిన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి కీలకమని 85 సంస్థలు పేర్కొన్నాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

