Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
Vithal Goud | కల్లుగీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రా ష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.
కోటగిరి : కల్లుగీత కార్మికుల ( Kallu Geetha workers ) కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్( Vithal Goud ) డిమాండ్ చేశారు. గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఈత వనంలో గీత పనివారాల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయర మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం గీత పని వారాల సంఘం అని అన్నారు.
కామ్రేడ్ ధర్మ బిక్షం స్థాపించిన సంఘం వారి ఆశల మేరకు సంఘం కొనసాగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని , కల్తీ పేరిట కల్లును రద్దు చేసే కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. కల్తీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు దుకాణాలపై దాడులు చేపడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాల కోసం గీత కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నార్కోటెక్, ఈగల్ టీం అని గీత కార్మికులకు భయాందోళన గురి చేస్తుందని, గీత కార్మికులపై అక్రమ కేసులు చేస్తూ జైలు పాలు చేస్తున్నారని మండిపడ్డారు . గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్న, యువత మద్యం తాగి బానిసలు అవుతున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కల్లుగీత కార్మికుల కుటుంబాలపై కక్ష సాధింపులు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, గీత వృత్తి పైన రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయని గౌడ కులస్తులు ఐక్యమై ఉద్యమించి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోటగిరి టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్, ఆర్ రమేష్ గౌడ్, నారా గౌడ్, రామా గౌడ్ ,కల్లుగీత కార్మికులు పి రాజా గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Health Tips | అంజీరా పండ్లు తరచూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
Women Professors | శాంతియుత నిరసన చేస్తున్న ప్రొఫెసర్ల అరెస్ట్.. పోలీసుల దౌర్జన్యం.. వీడియో
‘దళారులతో కుమ్మక్కై రైతులను దగా చేస్తున్న సర్వభ్రష్ట ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

