‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేందుకు వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీసీహెచ్ఎస్ వై.సూర్య శ్రీ రావు సూచించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.
– డీసీహెచ్ఎస్ సూర్య శ్రీ రావు
రామన్నపేట, నవంబర్ 12 : ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్యను పెంచేందుకు వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీసీహెచ్ఎస్ వై.సూర్య శ్రీ రావు సూచించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. వార్డులలో, ఓపి విభాగంలో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, ప్రసవాల పరిస్థితిపై వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. గురువారం ఒక్కరోజే ఆస్పత్రిలో ఐదు కాన్పులు నిర్వహించడం పట్ల వైద్యులను అభినందించారు. రోగులకు అందుబాటులో ఉంటూ ఇంకా మెరుగైన మంచి సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో పారిశుధ్యం, మందుల లభ్యత, రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల స్కానింగ్ కు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు ఆమె దృష్టికి తీసుకురాగా త్వరలోనే రేడియాలజిస్టును నియమిస్తామని తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
G.O.A.T | ‘గోట్’ సినిమా రివ్యూ.. సుడిగాలి సుధీర్ మాస్ యాక్షన్ మెప్పించిందా?
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ : ఎమ్మెల్యే బాలు నాయక్
Vithal Goud | కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

