గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీ గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి సర్పంచ్ గుగులోత్ కిశోర్ నాయక్ గురువారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం..
బూర్గంపహాడ్, నవంబర్ 12 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీ గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి సర్పంచ్ గుగులోత్ కిశోర్ నాయక్ గురువారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, గత కొంతకాలంగా సరైన వసతిలేక ఇబ్బందులు పడుతున్న తల్లులు, చిన్నారులకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు తమ పాలకవర్గం నిరంతరం కట్టుబడి ఉంటుందని సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో తార, పంచాయతీ ఈవో గుగులోత్ రవికుమార్, పాలకవర్గ సభ్యులు తిరుపతి ఏసోబు, శిరీష, హైమావతి, కొమరం సావిత్రి, భీమా, మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి, దామెర ఆదినారాయణ, పేరాల శ్రీనివాస్, నాగరాజు, చందునాయక్, సూపర్వైజర్, ఐటీసీ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
‘రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి’
Nitrates | తాగునీటిలో అధిక నైట్రేట్ అవశేషాలు.. ప్రజల ఆరోగ్యానికి ముప్పు అంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

