Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Quality coal | ప్రస్తుత పోటీ మార్కెట్లో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.
గోదావరిఖని : ప్రస్తుత పోటీ మార్కెట్లో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును (Quality coal ) సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ (RG GM Lalit Kumar ) అన్నారు. రామగుండం ఏరియా-1 జీఎం కార్యాలయంలో క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలుప్రారంభమయ్యాయి. క్వాలిటీ అవగాహన కరపత్రాలను పంపిణీ చేసి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనుల్లో బొగ్గు వెలికితీసే సమయంలో బండ, మట్టి, షేల్ లేయర్లను వేరుచేస్తూ మంచి గ్రేడ్ బొగ్గును లోడింగ్ చేయాలని సూచించారు. ఇప్పటికే జిడికె-2ఏ భూగర్భ గనిలో షేల్ లేయర్‌ను వేరు చేస్తూ నాణ్యతను పెంచుకున్నారని తెలిపారు. జిడికె-1 ఇంక్లైన్లో మంచి నాణ్యత గల బొగ్గును అందిస్తుండటంతో స్థానిక వినియోగదారులు పోటీపడి మరీ రోజుకు సుమారు 500 టన్నుల బొగ్గును కొనుగోలు చేస్తున్నారని అభినందించారు.
ప్రతి పని ప్రదేశంలో సూపర్వైజర్ నుంచి షావెల్ ఆపరేటర్ వరకు అందరూ సమష్టి కృషితో తమ బాధ్యతలను నిర్వర్తిస్తేనే నాణ్యత ప్రమాణాలను మరింత పెంచగలమని పేర్కొన్నారు. ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎం వెంకటరమణ మాట్లాడుతూ ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలు తక్కువ ధరలకు బొగ్గును విక్రయిస్తున్న నేపథ్యంలో, తీవ్రమైన మార్కెట్ పోటీని తట్టుకుని వినియోగదారులను కాపాడుకోవాలంటే నాణ్యత ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోఎస్ఓటు జీఎం కె. చంద్రశేఖర్, ఏజీఎం కాశీ విశ్వేశ్వరరావు, యస్.ఓ.యం బ్రహ్మాజీ రావు, డీజీఎం ధనలక్ష్మి బాయి, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి అధికారులు మోహన్ రావు, కర్ణ, వేణు, సురేష్, సి.ఎం.ఓ.ఏ.ఐ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏఐటీయూసీ ప్రతినిధి ఇజ్జగిరి రాజు తో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

