Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Siddharth Galla | సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మేనల్లుడు, గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హైయిన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట వివాహ వేడుక ఇటలీలో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.
Siddharth Galla | సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మేనల్లుడు, గల్లా జయదేవ్ చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హైయిన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఈ జంట వివాహ వేడుక ఇటలీలో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కాగా, సిద్ధార్థ్ గల్లా, హైయిన్ కిమ్‌ల నిశ్చితార్థం ఈ ఏడాది జూలై 13న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య, ప్రముఖ నటి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రత్యేక పోస్టు ద్వారా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా సిద్ధార్థ్, హైయిన్ల వివాహ వేడుకకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ను నమ్రత అభిమానులతో పంచుకున్నారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చిత్రాలను కూడా షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. సిద్ధార్థ్ గల్లా, హైయిన్ కిమ్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో ఘట్టమనేని కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. కాబోయే వధూవరులు కలిసి దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా విదేశీ అమ్మాయితో సిద్ధార్థ్ వివాహం చేసుకోబోతుండటంతో ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అయితే సిద్ధార్థ్, హైయిన్ కిమ్ ఎప్పుడు, ఎక్కడ పరిచయమయ్యారు? వారి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ జంట తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను గోప్యంగానే ఉంచుతున్నారు. ఏదేమైనా మహేష్ బాబు మేనల్లుడు అంతర్జాతీయ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, మహేష్ బాబు సోదరి పద్మావతి, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు .ఇక చిన్న కుమారుడు సిద్ధార్థ్ గల్లా మాత్రం కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయన ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో గల్లా, ఘట్టమనేని కుటుంబాల్లో పెళ్లి సందడి నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

