న్యూఢిల్లీ: మణిపూర్లో జరుగుతున్న పరిణామాల గురించి సభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ(Sonia Gandhi) ఇవాళ ప్రధాని మోదీని కోరారు. ఈ విషయాన్ని మరో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఇవాళ లోక్సభలో ఈ ఘటన జరిగిందన్నారు. తొలి రోజు సభ సందర్భంగా ప్రధాని మోదీ విపక్ష నేతల్ని కలిశారు. గ్రీటింగ్ చేస్తున్న సమయంలో సోనియా గాంధీతోనూ మోదీ మాట్లాడారు. విపక్ష నేతల బెంచ్ వద్దకు చేరుకున్న సమయంలో ఆయన సోనియాతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో మణిపూర్ గురించి సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరినట్లు అధిర్ రంజన్ తెలిపారు. మరోవైపు సోనియా ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.