న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆదివారం ఆమె ఢిల్లీలోని సర్ గంగారం దవాఖానలో చేరారు.
ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నదని, గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉన్నారని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 9న ఆమె ఇదే దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.