న్యూఢిల్లీ: లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం శాంతియుతంగా పోరాడుతున్న తన భర్త సోనం వాంగ్చుక్పై వస్తున్న ఆరోపణల్ని ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్రంగా ఖండించారు. వాంగ్చుక్పై దేశ వ్యతిరేక ముద్ర వేయటం.. తమపై ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కక్ష సాధింపు చర్యగా ఆమె పేర్కొన్నారు.
మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, పాకిస్థాన్ నిఘా సంస్థతో వాంగ్చుక్కు సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ చేసిన వాదనను ఆమె తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నారు. లద్దాఖ్ పోలీసులు రాజకీయ ఎజెండాతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్ విసిరారు.