న్యూఢిల్లీ, జూలై 22: నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై శిక్షాత్మక, ప్రతీకార చర్యలు తీసుకోవద్దంటూ పర్యావరణ ఉద్యమకారుడు వాంగుచుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాస్తూ దవాఖానలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
విస్తృతంగా జరిగిన చర్చల్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం తనకు హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. అలాగే నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందజేయడానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు.