Russia-India | ఐరాసలో ఇండియా శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. పశ్చిమ దేశాలకు నో
Russia-India : ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నామని రష్యా ప్రకటించింది. అలాగే, పశ్చిమ దేశాలకు మాత్రం ఈ విషయంలో చోటు లేదని కూడా రష్యా స్పష్టం చేసింది.
Russia-India : ఐక్యరాజ్యసమితిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నామని రష్యా ప్రకటించింది. అలాగే, పశ్చిమ దేశాలకు మాత్రం ఈ విషయంలో చోటు లేదని కూడా రష్యా స్పష్టం చేసింది. అమెరికా, న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య వార్షిక సమావేశం (యూఎన్జీఏ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడారు.
ఇండియా శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఏ పాశ్చాత్య దేశానికి కొత్తగా శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు తాము వ్యతిరేకం అని లావ్రోవ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపడుతున్న సంస్కరణలు కౌన్సిల్ ప్రగతిని, శాశ్వత దేశాల అభివృద్ధిని అడ్డుకోకూడదని అభిప్రాయపడ్డారు. సంస్కరణల పేరుతో పాశ్చాత్య దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడానికి తాము వ్యతిరేకం అన్నారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్ వంటి దేశాలకు మద్దతు ఇవ్వబోమని చెప్పారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ఇండియాతోపాటు బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వం విషయంలో తాము మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
Russia FM LAVROV DEMANDS UN REFORM to ADD ‘REPRESENTATIVES from ASIA, AFRICA, LATIN AMERICA’
‘CANNOT ALLOW’ more WESTERN SEATS — ‘ALREADY OVERREPRESENTED’
‘Look at who occupying TOP RANKS of secretariat… significant positions… occupied by… nationals of… NATO member states’ pic.twitter.com/L3j96ZNKcH
— RT Intl (@RT_on_X) September 26, 2026
ఐరాసలో ఇండియా శాశ్వత సభ్యత్వం కోసం పోర్చుగల్, మారిషస్ కూడా మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఐరాసలో ఆయా దేశాలు ప్రకటన కూడా చేశాయి. ప్రస్తుతం చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా మాత్రమే ఐరాసలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంటుంది. అలాగే, పది దేశాలు కూడా తాత్కాలిక సభ్య దేశాలకు వీటో ఉంటుంది. వీటి కాలపరిమితి రెండేళ్లు. ప్రతి రెండేళ్లకోసారి సభ్యదేశాలు మారుతుంటాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

